-->

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి – కేంద్ర మంత్రులతో కీలక భేటీ

 

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి – కేంద్ర మంత్రులతో కీలక భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానం నాయకులతో ఆయన కీలకంగా సమావేశమవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై చర్చలు జరపనున్నారు.

ముఖ్యంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ట్రిపుల్‌ఆర్‌ (Regional Ring Road) పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు. అలాగే హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌కు కేంద్ర మద్దతు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించే అవకాశం ఉంది.

ఇంకా కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులపై కూడా చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరనున్నారు.

ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కూడా సీఎం కోరనున్నట్లు సమాచారం.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో కూడా రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపై చర్చలు జరిపే అవకాశముంది. ఈ భేటీలు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793