-->

కరీంనగర్‌లో న్యాయవాదుల నిరసన.. ఖాజా మొహినోద్దీన్ హత్యపై ఆగ్రహం

కరీంనగర్‌లో న్యాయవాదుల నిరసన.. ఖాజా మొహినోద్దీన్ హత్యపై ఆగ్రహం

కరీంనగర్‌లో న్యాయవాది ఖాజా మొహినోద్దీన్ హత్య ఘటనపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. హత్యకు కారణమైన నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఖాజా మొహినోద్దీన్ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793