కొత్తకోట తహసీల్దార్ సస్పెన్షన్.. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం
తెలంగాణ వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న చాంద్ బాషాను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆత్మకూరు తహసీల్దారుగా పనిచేస్తున్న చాంద్ బాషాను డెప్యూటేషన్‌పై కొత్తకోట తహసీల్దార్‌గా నియమించారు. అయితే విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.
ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మెడికల్ లీవ్‌పై వెళ్లడం, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Post a Comment