పెద్దపల్లిలో ఎస్.ఐ.ఓ ఆధ్వర్యంలో ఇస్లామిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ ఆహ్వానం
పెద్దపల్లి, మే 19: యువతలో ఇస్లామిక్ విలువలు, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో Students Islamic Organisation of India (ఎస్.ఐ.ఓ) పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఇస్లామిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యాంప్ - 2026” ఆహ్వాన పోస్టర్‌ను ప్రముఖులు మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ.ఓ జిల్లా అధ్యక్షుడు ముజైఫుద్దీన్ మాట్లాడుతూ, యువతకు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యత, నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరమని తెలిపారు. ఈ లక్ష్యంతోనే మూడు రోజుల ప్రత్యేక రెసిడెన్షియల్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ జావీద్ అక్మల్ హుస్సేనీ, ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ గోదావరిఖని వైస్ ప్రెసిడెంట్, టెమ్రీస్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్.ఐ.ఓ యూనిట్ ప్రెసిడెంట్ ఫాజిల్ అహ్మద్ ఖాన్, సెక్రటరీ మీర్జా ఆసిఫ్, సభ్యులు ఫౌజాన్, రెహాన్ తదితరులు హాజరయ్యారు.
మే 20 నుంచి 22 వరకు పెద్దపల్లిలోని మస్జిద్-ఎ-ఫిర్దౌస్ లో ఈ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 14 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
క్యాంప్‌లో ఇస్లాం అవగాహన, ఖుర్ఆన్ & హదీస్ సెషన్లు, నాయకత్వ శిక్షణ, కెరీర్ మార్గదర్శనం, క్రీడలు మరియు పలు ప్రేరణాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి గల యువత వెంటనే నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. వివరాల కోసం కన్వీనర్ మిర్జా ఫైజాన్ బేగ్ (9618244688), కో-కన్వీనర్ ఫాజిల్ అహ్మద్ ఖాన్ (8500038347)లను సంప్రదించాలని తెలిపారు.

Post a Comment