-->

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్

బిగ్ బ్రేకింగ్: తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్


ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన తొమ్మిది రోజుల తర్వాత ఆయన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా.. తాజాగా భగీరథ్ లొంగిపోవడం కీలక పరిణామంగా మారింది.

ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను సుమారు 40 నిమిషాల పాటు రికార్డు చేసినట్లు సమాచారం.

అలాగే, బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793