మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై కేసు నమోదు
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నాయిని అనిల్ కుమార్ గౌడ్ మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికతో అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపినట్లు సమాచారం.
చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన పోలీసు ఉద్యోగి ఇలాంటి చర్యకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధిక కట్నం ఆశతో మైనర్ బాలికలను వివాహం చేసుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటనపై శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించి హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్‌పై బాల్య వివాహ నిషేధ చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత వివరాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Post a Comment