-->

సుజాతనగర్ కబ్రస్థాన్ ప్రహరీ గోడకు రూ.10 లక్షల ఎంపీ వద్దిరాజు నిధులు మంజురు

సుజాతనగర్ కబ్రస్థాన్ ప్రహరీ గోడకు రూ.10 లక్షల ఎంపీ వద్దిరాజు నిధులు మంజురు

సుజాతనగర్ కబ్రస్థాన్ ప్రహరీ గోడకు రూ.10 లక్షల ఎంపీ వద్దిరాజు నిధులు మంజురు 

కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరపాలక సంస్థ పరిధిలోని సుజాతనగర్ 22వ డివిజన్‌లో ఉన్న కబ్రస్థాన్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల (MPLADS) నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు.

కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతలపూడి పార్వతి ముస్లిం సోదరులకు కబ్రస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఈ సమస్యను అప్పటి కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు.

ఈ మేరకు మంజూరు పత్రాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు స్థానిక ముస్లిం మత పెద్దలకు అందజేశారు. మరో వారం రోజుల్లో ప్రహరీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కబ్రస్థాన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు, సమస్య పరిష్కారానికి కృషి చేసిన చింతలపూడి పార్వతికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుజాతనగర్ మసీదు ముతవల్లి, డాక్టర్ అనీష్, లావుడ్యా సత్యనారాయణ, పెద్దమల్ల నరేంద్ర ప్రసాద్, చింతలపూడి జగన్, మండే చంటి, ఎస్‌కే బాబా, ఎస్‌కే బనగీ సాబ్, ఎస్‌కే షర్ఫుద్దీన్, చింతల ప్రదీప్, పులి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793