-->

మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

పెద్దపల్లి మున్సిపల్ ఏఈ ఏసీబీ వలలో.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

పెద్దపల్లి, జూలై 14: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి సంచలన దాడి నిర్వహించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా పనిచేస్తున్న సతీష్‌ను రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను వద్ద నుంచి ఏఈ సతీష్ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఆయనను పట్టుకున్నారు.

దాడులకు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత ఏఈ సతీష్‌ను ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం విచారణ నిమిత్తం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తూ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కలకలం నెలకొంది. ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఏసీబీ కఠినంగా వ్యవహరిస్తోందని, లంచం తీసుకునే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793