-->

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి: కల్వకుంట్ల కవిత

 

సింగరేణిలో డిపెండెంట్, మెడికల్ఉ బోర్డు ద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి: కల్వకుంట్ల కవిత

సింగరేణిలో డిపెండెంట్, మెడికల్ఉ బోర్డు ద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి: కల్వకుంట్ల కవిత

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలో నిర్వహిస్తున్న సింగరేణి బాయిబాట రెండో విడత పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ, TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్, హెచ్‌ఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పర్యటనలో భాగంగా 5 షాఫ్ట్ గేట్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామకాల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల మంజూరులో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రతి నెల కనీసం రెండుసార్లు మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న అన్ని డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే క్లియర్ చేయాలని ఆమె కోరారు.

అలాగే, మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తామని అనుబంధ కార్మిక సంఘాల ద్వారా అనధికారికంగా సమాచారం ఇవ్వడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరాహార దీక్ష చేపడతానని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, వెంకన్నా, వై. అంజనేయులు, ఆసిఫ్,అశోక్ కుమార్, శ్రీలత, సింగరేణి కార్మికులు, డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను కవిత దృష్టికి తీసుకువచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793