-->

మహారాష్ట్రలో మరోసారి భూప్రకంపనలు.. తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించిన ఘటన

 

మహారాష్ట్రలో మరోసారి భూప్రకంపనలు.. తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించిన ఘటన

మహారాష్ట్రలో మరోసారి భూప్రకంపనలు.. తెల్లవారుజామున రెండుసార్లు భూమి కంపించిన ఘటన

హైదరాబాద్, జులై 9: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున వరుసగా రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. నాందేడ్, హింగోలి, పర్భణి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆకస్మికంగా భూమి కంపించడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అధికారుల వివరాల ప్రకారం, తొలి భూకంపం రాత్రి 1:37 గంటలకు సంభవించగా, రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదైంది. అనంతరం సుమారు రెండు గంటల తర్వాత, ఉదయం 3:23 గంటలకు మరోసారి భూమి కంపించింది. రెండో ప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదైంది.

ఈ భూకంపానికి హింగోలి సమీపంలోని 19.589 అక్షాంశం, 77.156 రేఖాంశం ప్రాంతం కేంద్రంగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.

భూప్రకంపనల తీవ్రత పెద్దగా లేకపోయినా, ఇళ్లలోని పాత్రలు కింద పడిపోవడం, గోడ గడియారాలు, కిటికీలు, తలుపులు ఊగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మహిళలు, చిన్నారులు సహా స్థానికులు భయంతో ఇళ్లను విడిచి బయటకు వచ్చి కొంతసేపు రోడ్లపైనే గడిపారు.

అయితే ఈ భూప్రకంపనల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793