-->

ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య.. నాగర్‌కర్నూల్‌లో విషాదం

 

ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య.. నాగర్‌కర్నూల్‌లో విషాదం

ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య.. నాగర్‌కర్నూల్‌లో విషాదం

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎనుముల మహేష్, శిరీష (23) దంపతులకు మానశ్రీ (3), వర్షిత్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిరీష ముందుగా ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసి, అనంతరం తాను కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

సాయంత్రం పొలం నుంచి మహేష్, అతని తల్లిదండ్రులు ఇంటికి చేరుకోగా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. ఇంటి ఆవరణలోని నీటి సంపు మూత తెరిచి ఉండటాన్ని గమనించి లోపల చూడగా శిరీషతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793