ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపీ పి.వి.డి. లక్ష్మికి ఘన సన్మానం
ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీపీ పి.వి.డి. లక్ష్మికి ఘన సన్మానం
ఖమ్మం: ఖమ్మం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బదిలీ అయిన పి.వి.డి. లక్ష్మికి ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో ఈసీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముధులకర్, ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేష్, సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు, క్రీడా కార్యదర్శి బానోత్ దేవదాస్, సీనియర్ న్యాయవాది రవిలాల రామారావు తదితరులు మాట్లాడుతూ, పి.వి.డి. లక్ష్మి విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి న్యాయవాదుల అభిమానాన్ని సంపాదించారని కొనియాడారు. ఖమ్మం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో కూడా ఆమె విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.
సన్మానానికి స్పందించిన పి.వి.డి. లక్ష్మి, తనపై చూపిన ఆదరణకు ఈసీ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా అదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ న్యాయానికి సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment