-->

ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.

 

ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. నిందితుడిపై చర్యలు కోరుతూ బంధువుల ఆందోళన

ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య.. నిందితుడిపై చర్యలు కోరుతూ బంధువుల ఆందోళన

మంచిర్యాల, జూలై 14: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్నాననే మనస్తాపంతో మాధవి అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నిందితుడు వెంకటేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గమనిక: ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఆరోపణల ఆధారంగా ఈ సమాచారం వెలువడింది. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793