వరంగల్‌లో ఘనంగా శ్రీ బీరప్ప స్వామి బోనాల మహోత్సవాలు.. బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ
వరంగల్‌లో ఘనంగా శ్రీ బీరప్ప స్వామి బోనాల మహోత్సవాలు.. బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ
వరంగల్ నగరంలోని ఓ సిటీ, కరీమాబాద్, ఉర్సుగుట్ట ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన శ్రీ బీరప్ప (బీరన్న) స్వామి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి, శ్రీ బీరప్ప స్వామి వారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగ మన ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. శ్రీ బీరప్ప స్వామి వారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
తెలంగాణ గొప్ప ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి అన్నారు. ఇలాంటి పవిత్ర ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించుకోవడం ద్వారా మన సంస్కృతిని పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
శ్రీ బీరప్ప స్వామి వారి దీవెనలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. బోనాల మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

Post a Comment