రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
హైదరాబాద్‌లో మరో అవినీతి అధికారి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫూల్‌బాగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రభావతి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. మంగళవారం (ఆగస్టు 18) ఈ ఘటన చోటుచేసుకుంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఫూల్‌బాగ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ప్రభావతి లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అవినీతికి పాల్పడే ఎంతటి అధికారులపైనైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment