-->

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీపై మెరుపు దాడులు.. 25 టన్నులకుపైగా స్వాధీనం

 

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీపై మెరుపు దాడులు.. 25 టన్నులకుపైగా స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీపై మెరుపు దాడులు.. 25 టన్నులకుపైగా స్వాధీనం

హైదరాబాద్, ఆగస్టు 4: హైదరాబాద్ నగరంలో కల్తీ మసాలాల తయారీ, విక్రయాలపై ఫుడ్ యాంటీ స్పెషల్ టీం ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు తదితర మసాలాల్లో భారీ స్థాయిలో కల్తీ జరుగుతున్నట్లు గుర్తించారు. మసాలాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు టాల్కమ్ పౌడర్, హానికర రసాయనాలు, ఇండస్ట్రియల్ డైలు, ఫ్యాబ్రిక్ కలర్స్, సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

నాసిరకం ఉత్పత్తులకు రంగులు అద్ది నాణ్యమైన మసాలాలుగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ దాడుల్లో సుమారు 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు, అలాగే తయారీకి వినియోగిస్తున్న 89 టన్నులకుపైగా ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు కేసులు నమోదు చేసి, ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మసాలా నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు నాణ్యమైన, గుర్తింపు పొందిన బ్రాండ్ల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793