తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారుల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేజీఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా కేజీఎస్ మాథ్యూస్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఉద్యమకారులు ఎన్నో కష్టాలు, త్యాగాలను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలిదశ, మలిదశ ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమైందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం, సమాజం గుర్తించి తగిన గౌరవం కల్పించాలని ఆయన కోరారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు పి. రామచందర్, కామేశ్వరరావు, కొమరయ్య, వీరస్వామి, సీతారాం, మంగపతిరావు, మొహ్మద్ గౌస్, పురుషోత్తం, కృష్ణార్జునరావు, మండే అంజనేయులు, శ్రీహరి, కామేశ్వరరావు, నాగేశ్వరరావు, దామేరకొండ మల్లయ్య, భీమయ్య, సర్వత్తంరావు, విజయకుమార్, నిజామోద్దీన్, రాజయ్య, రామలక్ష్మి, అప్పిరెడ్డి, మౌలానా, బ్రహ్మం తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

Post a Comment