-->

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు


టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కొత్తగూడెం: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా కార్పొరేట్ ఏరియాలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయం వద్ద రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవం, దేశభక్తి విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని, శాంతి, సౌభ్రాతృత్వాలతో కూడిన బలమైన ప్రజాస్వామిక భారతదేశ నిర్మాణమే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

పౌరులందరికీ సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అందేలా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. నవ భారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దేశ పురోగతిలో సింగరేణి ఉద్యోగుల కృషి ఎంతో కీలకమని కాపు కృష్ణ కొనియాడారు. సింగరేణి కార్మికులు తమ శ్రమతో దేశ ఆర్థికాభివృద్ధికి, విద్యుత్ రంగానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్లు గడప రాజయ్య, తుమ్మ శ్రీనివాస్, సెంట్రల్ కమిటీ సభ్యులు కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్, ఎంటెక్ మహేందర్, ఏరియా కమిటీ నాయకులు విద్యాసాగర్, రాజకుమార్, రాములు, సూరిబాబు, అమర్, బాబు జాన్, పాషా, పిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రాంబాబు, రాజేష్, దేవ్‌సింగ్‌తో పాటు టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793