మానసిక ఒత్తిడితో మోడల్ శృతి ఆత్మహత్య
మానసిక ఒత్తిడితో మోడల్ శృతి ఆత్మహత్య
కర్ణాటక: మానసిక ఒత్తిడితో ఓ మోడల్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. మల్పె పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్మాడి ప్రాంతానికి చెందిన మోడల్ శృతి బంగేర (27) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శృతి కొంతకాలంగా మోడలింగ్ రంగంలో కొనసాగుతూ, కడియాళలోని ఓ హోటల్‌లో ఉద్యోగం కూడా చేస్తోంది. అయితే గత ఐదు నెలలుగా ఆమె ఉద్యోగానికి వెళ్లకుండా తల్లి రత్న, సోదరితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం శృతి తన తల్లి రత్నను ఇంటి నుంచి బయటకు పంపిన అనంతరం లోపల నుంచి తలుపు వేసుకుంది. అనంతరం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
శృతి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం తెలియరాలేదు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక ఒత్తిడికి గురికావడానికి గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.

Post a Comment