-->

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన

 

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన

జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 24: మండల స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు హాజరయ్యారా లేదా అనే అంశాన్ని కలెక్టర్ పరిశీలించారు. గత వారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల పరిష్కార పురోగతిపై ఆరా తీశారు.

అలాగే నూతన పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. పెన్షన్ మంజూరుకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల మేరకు పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతగా స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793