విశ్వ ప్రవక్త ముహమ్మద్ ﷺ – జీవితం, సందేశం” పుస్తకం ఆవిష్కరణ
హైదరాబాద్, ఆగస్టు 23: ప్రవక్త ముహమ్మద్ ﷺ పవిత్ర జీవితం, బోధనలు, మానవతా సందేశాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసే “విశ్వ ప్రవక్త ముహమ్మద్ ﷺ – జీవితం, సందేశం” తెలుగు సీరత్ గ్రంథం ఘనంగా విడుదలైంది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పుస్తక ఆవిష్కరణ.
ఈ సీరత్ గ్రంథాన్ని ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ రచించారు. ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత విశేషాలు, ఆయన బోధనలు, మానవతా విలువలను తెలుగు పాఠకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకంలో వివరించినట్లు రచయిత తెలిపారు.
దయ, కరుణ, సత్యం, న్యాయం ఆదర్శాలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవితం సమాజానికి ఎన్నో విలువైన సందేశాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఆయన బోధించిన దయ, కరుణ, సత్యం, న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
తెలుగు భాషలో సీరత్ గ్రంథాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని కవిత పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవితం, విశ్వమానవతా సందేశాన్ని తెలుగు ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
తెలుగు పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా..
రచయిత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ మాట్లాడుతూ.. ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవితంలోని ఆదర్శాలు, మానవతా విలువలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. తెలుగు పాఠకులు సులభంగా అర్థం చేసుకునే విధంగా సీరత్ గ్రంథాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రవి చంద్ర, సయ్యద్ ఇస్మాయిల్, ముఫ్తీ మహమ్మద్ అఫ్జల్ బియాబానీ సుహైబ్, టీఆర్‌ఎస్ మైనారిటీ నాయకులు, ముస్లిం మహిళా నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఫోటో క్యాప్షన్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన కార్యాలయంలో “విశ్వ ప్రవక్త ముహమ్మద్ ﷺ – జీవితం, సందేశం” తెలుగు సీరత్ గ్రంథాన్ని ఆవిష్కరించ్చారు. చిత్రంలో రచయిత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, సీనియర్ జర్నలిస్ట్ రవి చంద్ర, సయ్యద్ ఇస్మాయిల్, ముఫ్తీ మహమ్మద్ అఫ్జల్ బియాబానీ సుహైబ్, టీఆర్‌ఎస్ మైనారిటీ నాయకులు, ముస్లిం మహిళా నాయకులు తదితరులు.

Post a Comment