-->

దేశంలో చక్కెర కొరత.. దిగుమతులు దిగుమతి చేసినాము

 

రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో ప్రభావమే కారణం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

దేశంలో చక్కెర కొరత.. దిగుమతులు దిగుమతి చేసినాము 

రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో ప్రభావమే కారణం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి

పెరుగుతున్న రిటైల్‌ ధరలపై కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ: దేశంలో చక్కెర కొరత ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. చక్కెర కొరత, పెరుగుతున్న రిటైల్‌ ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అవసరాలను తీర్చేందుకు చక్కెరను దిగుమతి చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రెడ్‌ ర్యాట్‌ వ్యాధి, ఎల్‌ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా చెరుకు ఉత్పత్తి తగ్గడం వల్ల చక్కెర లభ్యతపై ప్రభావం చూపిందని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాది సుమారు 280 లక్షల టన్నుల చక్కెర అవసరం ఉంటుందని, ప్రస్తుతం 20 నుంచి 25 లక్షల టన్నుల మేర అదనపు చక్కెర నిల్వలు ఉన్నాయని మంత్రి వివరించారు.

పెరుగుతున్న చక్కెర ధరలు

కేంద్ర మంత్రి దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. మార్కెట్‌లో చక్కెర రిటైల్‌ ధరలు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. జూలై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20 నాటికి అది రూ.55.70కు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే నెల రోజుల్లోనే కిలోకు సుమారు రూ.7.50 మేర ధర పెరిగింది.

ఇంత తక్కువ వ్యవధిలో చక్కెర ధరలు భారీగా పెరగడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్రం తీసుకునే చర్యలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

కేంద్రంపై కాంగ్రెస్‌ విమర్శలు

చక్కెర ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చెరుకు రైతులకు కేంద్రం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు చెరుకు సాగును తగ్గించారని ఆరోపించారు. ఏడాది పాటు బిల్లులు చెల్లించకపోతే రైతులు అదే పంటను ఎందుకు సాగు చేస్తారని ప్రశ్నించారు.

భారత్‌ ఒకప్పుడు భారీగా చక్కెరను ఎగుమతి చేసే దేశంగా ఉండేదని, ఇప్పుడు చక్కెరను దిగుమతి చేసుకునే పరిస్థితికి చేరుకోవడం ఆందోళనకరమని సుర్జేవాలా విమర్శించారు.

మరోవైపు దేశీయ అవసరాలకు అనుగుణంగా చక్కెర లభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేస్తోంది. ధరల నియంత్రణ, నిల్వల నిర్వహణ, దిగుమతుల ద్వారా సరఫరా పెంపు వంటి చర్యలతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793