-->

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి

 

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి

ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3: సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ప్రార్థించారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా లష్కర్ బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తుల రద్దీ మధ్య ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగగా, ఆలయ పరిసరాల్లో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793