ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. సబ్సిడీ గడువు పొడిగింపు
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త.. సబ్సిడీ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘పీఎం ఇ-డ్రైవ్’ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న సబ్సిడీ గడువును పొడిగించింది. ఈ పథకం కింద సబ్సిడీ ప్రయోజనాలను పొందే గడువును 2028 మార్చి 31 వరకు కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్ అవర్ (kWh)కు రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అయితే ఒక్క వాహనానికి గరిష్టంగా రూ.5,000 వరకు మాత్రమే సబ్సిడీ అందుతుంది.
అయితే సబ్సిడీ క్లెయిమ్‌కు సంబంధించి 2027 డిసెంబర్ 31 వరకు గడువు ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు మరింత సమయం లభించనుంది. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

Post a Comment