-->

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్

 

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు.

సామాజిక సంస్కరణలు, మహిళా విద్య, సమానత్వం కోసం జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. మహిళలకు విద్యను అందించడంలో సావిత్రిబాయి ఫూలే కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్. కృష్ణయ్య, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మందుల సామేల్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793