-->

పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద దేశీ మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద దేశీ మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

 

పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద దేశీ మద్యం పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమంగా దేశీ మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేశారు.

ఎక్సైజ్ సీఐ రెండ్ల విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పౌజ్‌పూర్ గ్రామానికి చెందిన తోట స్వామి తన ద్విచక్ర వాహనంపై 85 దేశీ దారు మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు తనిఖీల్లో పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 85 దేశీ దారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.3,400 ఉంటుందని పేర్కొన్నారు.

నిందితుడిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, మద్యం రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

అక్రమంగా దేశీ మద్యం రవాణా, నిల్వ లేదా విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని ఎక్సైజ్ సీఐ రెండ్ల విజేందర్ హెచ్చరించారు. ప్రజలు కూడా అక్రమ మద్యం వ్యాపారంపై సమాచారం అందించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793