-->

కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

 

కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

కరీంనగర్‌లో 307 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

కరీంనగర్, సెప్టెంబర్ 29: కరీంనగర్‌లో భారీగా పీడీఎస్‌ (ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం పట్టుబడింది. హనుమాన్ రైస్ మిల్ ఇండస్ట్రీలో అక్రమంగా నిల్వ చేసిన 307 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం.. పీడీఎస్‌ బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేసి, వివిధ బ్రాండ్‌ల పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీబీ అధికారి సతీష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా పీడీఎస్‌ బియ్యం గుర్తించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి రైస్‌ మిల్‌ యజమాని కర్ణాకర్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు తదుపరి విచారణ కోసం సీజ్‌ చేశారు.

ప్రభుత్వం పేదలకు అందించాల్సిన ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలించడం, పాలిష్ చేసి వాణిజ్య అవసరాలకు వినియోగించడం వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.