-->

శంషాబాద్‌లో విషాదం.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం

శంషాబాద్‌లో విషాదం.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం


శంషాబాద్‌లో విషాదం.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణం

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధేశ్వర కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన 19 ఏళ్ల యువతి బూర నర్మద బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నర్మదకు నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్ బేజనీ గౌడ్‌తో కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉంది. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్ మృతి చెందాడు. అప్పటి నుంచి నర్మద తీవ్రంగా కుంగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రియుడు లేని లోకంలో తాను ఉండలేనంటూ తరచూ కన్నీరు పెట్టుకునేదని చెప్పారు.

ఇటీవల సిద్ధార్థ్ తన కలలోకి వచ్చి తనను పిలుస్తున్నాడంటూ నర్మద తల్లిదండ్రులు, సోదరితో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో నర్మద బలవన్మరణానికి పాల్పడింది.

తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు

ఘటనపై నర్మద తండ్రి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేకనే తన కుమార్తె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని తండ్రి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నర్మద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Blogger ఆధారితం.