కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ కేసు నమోదు
కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ కేసు నమోదు
కుటుంబ వివాదం నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన కొత్తగూడెం 3టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దూషించుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిని సైతం నెట్టివేసి, విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. సంబంధిత నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
కుటుంబ వివాదాలను చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాలని, పోలీస్‌స్టేషన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Post a Comment