-->

హయత్‌నగర్‌లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు సీజ్

హయత్‌నగర్‌లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు సీజ్


హయత్‌నగర్‌లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 730 కిలోలు సీజ్

హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌పై అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. M-FAST, SOT ఎల్బీనగర్, హయత్‌నగర్ పోలీసులు కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో భారీగా కల్తీ పేస్ట్‌ బయటపడింది.

హయత్‌నగర్‌లోని ఓ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్‌లో అపరిశుభ్ర పరిస్థితుల్లో పేస్ట్ తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తనిఖీల్లో సుమారు 730 కిలోల అల్లం–వెల్లుల్లి పేస్ట్, అలాగే గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పేస్ట్ తయారీలో స్వాధీనం చేసుకున్న గుర్తుతెలియని ద్రావణం, ఫుడ్ కలర్‌ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే అంశంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను పరీక్షలకు పంపించే అవకాశం ఉంది. కల్తీ పేస్ట్ తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.