కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9వ తరగతి విద్యార్థి మృతి
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9వ తరగతి విద్యార్థి మృతి
కామారెడ్డి, సెప్టెంబర్ 5: కామారెడ్డి పట్టణంలోని పాత జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోవడంతో 9వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం మేరకు.. ఇద్దరు ప్రాణ స్నేహితులు హేమంత్, లోకేష్ స్కూటీపై వెళ్తుండగా, రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో హేమంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన కారును నడిపింది కూడా మైనర్ బాలుడేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Post a Comment