-->

ఘట్‌కేసర్‌లో విషాదం.. కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని మృతి

 

ఘట్‌కేసర్‌లో విషాదం.. కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని మృతి

ఘట్‌కేసర్‌లో విషాదం.. కళాశాల మూడో అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్థిని మృతి

మేడ్చల్ జిల్లా: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని పల్లవి కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందింది.

సమాచారం ప్రకారం.. సాయంత్రం విద్యార్థులంతా కళాశాల నుంచి వెళ్లిపోయిన అనంతరం పల్లవి మూడో అంతస్తు నుంచి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాదం నెలకొంది.

మృతురాలు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా పోలీసులు గుర్తించారు. పల్లవికి ఇటీవలే శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరిగినట్లు సమాచారం. శ్రీకాంత్ రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఘటనపై సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్లవి మృతికి గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.