-->

పాపకొల్లులో కీ.శే. రోకటి సురేష్ ప్రథమ వర్ధంతి సభ పలువురు ప్రముఖులు హాజరై ఘన నివాళులు

 

పాపకొల్లులో కీ.శే. రోకటి సురేష్ ప్రథమ వర్ధంతి సభ
పాపకొల్లులో కీ.శే. రోకటి సురేష్ ప్రథమ వర్ధంతి సభ పలువురు ప్రముఖులు హాజరై ఘన నివాళులు

పలువురు ప్రముఖులు హాజరై ఘన నివాళులు

జూలూరుపాడు: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో కీ.శే. రోకటి సురేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మారక సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరై సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, సొసైటీ చైర్మన్లు మండే వీరహనుమంతరావు, లేళ్ల వెంకటరెడ్డి, వడ్డే నారాయణరావు, మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు సురేష్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

స్మారక సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం సురేష్ కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది.

Blogger ఆధారితం.