-->

సూరారం శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

 

ఐదుగురు అరెస్ట్‌.. రూ.10,380 నగదు, పేకముక్కలు స్వాధీనం

సూరారం శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

ఐదుగురు అరెస్ట్‌.. రూ.10,380 నగదు, పేకముక్కలు స్వాధీనం

శంకరంపేట(ఆర్), సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా శంకరంపేట(ఆర్) మండలం సూరారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం చేపట్టిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రణబోయిన విఠల్, ఉప్పరి గంగాధర్, బక్కన్న నర్సింలు, ఆమ్దా నాగరాజు, యాట దర్శన్ పేకాట ఆడుతుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.10,380 నగదు, పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ.. అక్రమ పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా అక్రమ పేకాట, జూదం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.

Blogger ఆధారితం.