-->

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

 దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సుందరయ్య కాలనీలో చోటుచేసుకుంది.

కాలనీకి చెందిన లావణ్య (32) రెండు రోజుల క్రితం తన తల్లి రాజేశ్వరికి ఫోన్ చేసి, దసరా పండగకు ముందే పుట్టింటికి వస్తానని తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని భర్తకు చెప్పగా ఆయన అంగీకరించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన లావణ్య మంగళవారం బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తహిసీనొద్దీన్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Blogger ఆధారితం.