బాన్సువాడలో ఆటో బోల్తా.. యువతి మృతి
బాన్సువాడలో ఆటో బోల్తా.. యువతి మృతి
బాన్సువాడ: ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందిన విషాద సంఘటన బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మహ్మద్‌నగర్ మండలం సింగీతం గ్రామానికి చెందిన కంచం ఇందు (21) బుధవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో బగవాన్ బాబుకు చెందిన AP 28 TB 4201 నంబర్ గల ఆటోలో సింగీతం నుంచి బాన్సువాడకు బయలుదేరింది.
మార్గమధ్యంలోని కొయ్యగుట్ట వద్దకు చేరుకోగానే ఆటో డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇందుకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇందు మృతి చెందింది.
మృతురాలి తల్లి కంచం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తుల శ్రీధర్ తెలిపారు.

Post a Comment