-->

సింగరేణి వాస్తవ లాభాలు వెల్లడించి కార్మికులకు 36% వాటా చెల్లించాలి TBGKS

 

సింగరేణి వాస్తవ లాభాలు వెల్లడించి కార్మికులకు 36% వాటా చెల్లించాలి TBGKS

సింగరేణి వాస్తవ లాభాలు వెల్లడించి కార్మికులకు 36% వాటా చెల్లించాలి TBGKS

కొత్తగూడెం: సింగరేణి కాలరీస్ కంపెనీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ వార్షిక లాభాలను వెంటనే వెల్లడించి, కార్మికులకు రావాల్సిన 36 శాతం లాభాల వాటాను దసరాలోపు చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేసింది.

గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాఫీ కృష్ణ ఆదేశాల మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కొత్తగూడెం కార్పొరేట్ ఆధ్వర్యంలో సెంట్రల్ వర్క్‌షాప్ జనరల్ మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా కార్పొరేట్ ఉపాధ్యక్షులు తుమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వాస్తవ లాభాలను యాజమాన్యం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. లాభాల్లో కార్మికులకు రావాల్సిన 36 శాతం వాటాను ఎలాంటి జాప్యం లేకుండా దసరా పండుగలోపు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

సింగరేణి అభివృద్ధిలో కార్మికుల శ్రమ కీలకమని, సంస్థ సాధించిన లాభాల్లో వారికి న్యాయమైన వాటా అందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు చెల్లించాల్సిన లాభాల వాటాపై స్పష్టత ఇవ్వడంతో పాటు వెంటనే చెల్లింపులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ వర్క్‌షాప్ ఫిట్ సెక్రెటరీ సూరజ్ సుబ్బారావు, సత్యనారాయణ, రాబిన్ రాజ్, శ్రావణ్, సత్తిపండు, భాస్కర్, శంకర్ సింహ, ప్రశాంత్ సెంట్రల్ వర్క్‌షాప్ కార్మికులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.