నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు రూ.3.60 లక్షల చెక్కుల పంపిణీ
నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు రూ.3.60 లక్షల చెక్కుల పంపిణీ
పాల్వంచ: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో నవ లిమిటెడ్, పాల్వంచ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
నవ మహిళా సాధికార కేంద్రంలో చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన తాటి ఆకుల కళాకృతులను విక్రయించడం ద్వారా రూ.2,58,470 ఆదాయం లభించింది. అలాగే మహిళలు కుట్టిన యూనిఫామ్స్ ద్వారా రూ.1,01,655 ఆదాయం సమకూరింది. ఈ రెండు విభాగాల ద్వారా వచ్చిన మొత్తం రూ.3,60,125 నగదుకు సంబంధించిన చెక్కులను నవ లిమిటెడ్ ప్రమోటర్ శ్రీమతి రమా దేవినేని చేతివృత్తుల కళాకారులకు అందజేశారు.
ఈ సందర్భంగా రమా దేవినేని మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, వారు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగినప్పుడే కుటుంబాల్లో సంతోషం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.
మహిళల్లోని నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్వయం ఉపాధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే నవ మహిళా సాధికార కేంద్రం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అముద, స్వరూపరాణి, అరుణ, బి.అరుణ, శిరీష, దివ్య, కవిత తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment