-->

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి కాపు సీతాలక్ష్మి.

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి కాపు సీతాలక్ష్మి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోండి కాపు సీతాలక్ష్మి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభం

కొత్తగూడెం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సూచనల మేరకు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ, 2023 నవంబర్ 1 నాటికి ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైన అర్హులైన పట్టభద్రులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను ఉచితంగా నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులతో పాటు అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు సమయానికి నమోదు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు సంకుబాపన అనుదీప్, వేముల ప్రసాద్ బాబు, కరాటే శ్రీను, కన్ని, అన్వర్, పూర్ణ, మనోజ్, ఈమంది గణేష్, శివ, మదాసు పద్మ, షరీఫ్, అంబుల వేణు గోపాల్, జున్నరు రాజేష్ గౌడ్, షణ్ముఖ్, సోహెబ్, సచిన్, రాకేష్ రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.