-->

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ లోని సేఫ్టీ పూజ

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ లోని సేఫ్టీ పూజ

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ లోని సేఫ్టీ పూజ 

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ లో సేఫ్టీ పూజను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పాల్గొనడం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ ఆధ్వర్యంలో మ్యాన్ రైడింగ్ సిస్టంను ప్రారంభించడం జరిగిందని అప్పటినుంచి గనిలో ఉద్యోగస్తుల గైర్హాజరు శాతం తగ్గి హాజరు శాతం పెరుగుతోందని తెలియజేశారు. ఉద్యోగులు వారికి కేటాయించిన పనులలో శ్రద్ధగా రక్షణతో చేయాలని ప్రతి ఒక్కరికి రక్షణ ప్రథమము అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు ఎస్ ఓటు జిఎం జీవి కోటిరెడ్డి, ఐ ఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, అలాగే పద్మావతి ఖని మైన్ ఏజెంట్ బి రవీందర్, మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793