తాటి చెట్టుపై నుండి కిందపడి గీత కార్మికుడు మృతి
తాటి చెట్టుపై నుండి కిందపడి గీత కార్మికుడు మృతి
తాటి చెట్టుపై నుండి కిందపడి గాయపడిన జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొంగోని రమేష్ గౌడ్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. రమేష్ గౌడ్ ఈ నెల 9న తాటి చెట్టు ఎక్కుతుండగా మోకు జారి కింద పడడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారై, కుమారుడు ఉన్నారు.

Post a Comment