-->

ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల సమ్మె 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి


ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల సమ్మె 3 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి

- వైద్యాధికారులు, కాంట్రాక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలి 

- 3 నెలల పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలి  

- సమ్మెను మరింత ఉధృతం చేస్తాం

ప్రభుత్వ హాస్పిటల్ కార్మికుల సమ్మెను టియుసిసి జాతీయ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ సమ్మెను ప్రారంభించడం జరిగింది. అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యాధికారులు కాంట్రాక్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే   కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ 250  మంది సమ్మె చేయడం జరుగుతుందని ఆరోపించారు. 

గత రెండు నెలలుగా కార్మిక సమస్యలు పరిష్కరించాలని దుఫలవారీగా ఆందోళనను ఫిర్యాదులు చేసిన పెడచెవిన పెట్టినారని విమర్శించారు. కార్మికులంటే అధికారులకు కాంట్రాక్టర్ లకు చిన్న చూపునదని ఆరోపించారు. 

తక్షణమే కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని, ఈపిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలనీ, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికులందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలని  తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

జీతాలు, ఇతర సమస్యల గురించి అడిగితే కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులను అక్కడి సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తున్నారు. కార్మికులు ఉదయం 7 గంటలకు రావాల్సిన కార్మికులు 15 నుండి 20 నిమిషాలు లేటుగా వస్తే సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు అదనంగా పనులు చేపించుకుంటున్నారు. కార్మికులు ఒక్కరోజు డ్యూటీకి రాకుంటే రెండు నుండి మూడు రోజులు రిజిస్టర్లో అప్సెంట్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వ వైద్యాధికారులతో, ఏజిల్ సంస్థ యజమాన్యంతో పెండింగ్ జీతాల గురించి మాట్లాడితే రెండు రోజుల్లో వస్తాయి, వారం రోజుల్లో వస్తాయని అనేకసార్లు దాటావేశారని,జీతాలు మాత్రం రాలేదని అన్నారు. హైదరాబాద్ లోని  వైద్య విధాన పరిషత్ సంచాలకులు( DME )గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగిందని, మూడు రోజుల్లో పెండింగ్ జీతాల సమస్య పరిష్కారం అవుద్ది అన్నారు.

 జులై -24 నుండి పోవాల్సిన సమ్మెను వారం రోజులు వాయిదా వేసుకున్నాము. అయినప్పటికీ కార్మికుల పెండింగ్ జీతాలు ఇతర సమస్యలు పరిస్కారం కాలేదని విమర్శించారు.  కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల జీతాల బడ్జెట్ వచ్చిన కార్మికులకు మాత్రం పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కార్మికులకు జీతాలు రాకపోవడంతో గత మూడు నెలలుగా ఇంటి కిరాయి కట్టలేదు, దీనితో ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయాలనీ వేదిస్తున్నారని అన్నారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని దుస్థితి ఉన్నదని, చాలా  మంది కార్మికుల పిల్లలకు  బుక్స్, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్లు కొనిచ్చే పరిస్థితి లేదని అన్నారు. డ్యూటీకి వద్దాము అంటే ఆటోకు, బండిలో పెట్రోల్ కు డబ్బులు లేని దుస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల బాధలు వర్ణనాతితంగా  ఉన్నాయని అన్నారు. 

 వైద్య అధికారులను, కాంట్రాక్టర్ యజమాన్యాన్ని అనేక సార్లు కార్మికుల పీఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో సరిగా జామచేయడం లేదని చెప్పిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని కార్మికులందరికీ ఐడి కార్డులు ఇవ్వాలని  తదితర సమస్యల గురించి వైద్య అధికారులు, ఏజిల్ సంస్థ యాజమానం దృష్టికి తీసుకువచ్చిన సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. 

కార్మికుల పిఎఫ్, ఈఎస్ఐ పై సమగ్ర విచారణ చేసి కార్మికుల ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కార్మికులకు జీతాలు ప్రతినెల 5 తేదీ లోపు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నామని చెప్పారు. 

*కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏఐవైఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్ సంపూర్ణ మద్దతు తెలియజేసి మాట్లాడారు.*

 ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు పి. అరుణ్, టి. కళావతి, ఉపాధ్యక్షులు పి. శారదా, నాయకులు సరళ, రేఖ, సతీష్, సాయి, అరుణ్, దివ్య, జ్యోతి, అంజలి, లత 250 కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.