తల్లడ అంగన్వాడి కేంద్ర భవనాలు శిథిలావస్థ
తల్లడ అంగన్వాడి కేంద్ర భవనాలు శిథిలావస్థ
ఖమ్మం జిల్లా తల్లాడ అంగన్వాడి కేంద్రం నిర్వహణపై పాలకులు అధికారుల విశ్వసించడం పూర్తిగా తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్ర భవనాలు శిథిలావస్థకు చేరాయి.
అదే గ్రామంలో యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల భవనాల్లో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు కాస్త వర్షం పడితే చాలు ప్రభుత్వ పాఠశాల ఆవరణంలోకి నీరు చేరి పిచ్చి మొక్కలు పెరిగి ఎటు నుంచి ఏమి వస్తుందా అనే భయాందోళనలో పిల్లలు కాలం గడుపుతున్నారు.
బిల్లుపాడు గ్రామంలో అంగన్వాడి కేంద్రం ఉన్నప్పటికీ అది ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం కట్టిన భవనం కాబట్టి అది పూర్తిగా శిథిలావస్థకు చేరి స్లాబుపై ఉన్న పెచ్చులు పడటం, కాస్త వర్షం పడేతే నీరు అంత గదులు నిండా నీరు వ్యాపించడంతో పిల్లలు అంగన్వాడి కేంద్రానికి రావాలంటేనే భయానికి గురవుతున్నారు. కాబట్టి పాలకులు అధికారులు ఇకనైనా కొత్త భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు.

Post a Comment