వక్ఫ్ పై ముస్లిం హక్కు ఉండకుండా చేయడమే ఈ సవరణ బిల్లు?
వక్ఫ్ పై ముస్లిం హక్కు ఉండకుండా చేయడమే ఈ సవరణ బిల్లు?
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు నిర్వీర్యానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను JIH జాతీయ ఉపాధ్యక్షులు మలిక్ మొతసిం ఖాన్ తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ బోర్డు చట్టానికి తీసుకొస్తున్న సవరణల విషయంలో కనీసం ముస్లిం ఎంపీలతో కానీ, సంస్థలతో కానీ కేంద్రం సంప్రదించలేదని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డులోకి మహిళలను తీసుకోవడం, ముస్లింలలో వెనుకబడ్డ బొహ్రా లాంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం మంచి పరిణామమే.
అయితే వక్ఫ్ బోర్డు ముస్లిమేతర భూములను కబళిస్తోందన్న ప్రభుత్వ ఆరోపణలు ఎంతమాత్రం నిజం కాదు. అలాగే వక్ఫ్ ఆస్తులను నిర్ధారించే విషయంలో కలెక్టర్లు అధికారం ఇవ్వడం, సెంట్రల్ వక్ఫ్ బోర్డులో ముస్లిం ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఆమోదనీయం కాదు. వక్ఫ్ చట్టాన్ని అల్లాటప్పాగా రూపొందించలేదని దీనిని పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చారని ఆయన అన్నారు.
ఈ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అవసరమైతే తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని గోదావరిఖని లో JIH - ఉపాధ్యక్షులు క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ TMREIS కౌన్సలర్ అన్నారు.

Post a Comment