నేతన్నకు అండగా చేనేత వస్త్రాలు ధరిద్ధాం నాగరాజ్ గౌడ్
నేతన్నకు అండగా చేనేత వస్త్రాలు ధరిద్ధాం నాగరాజ్ గౌడ్
కామారెడ్డి/బీబీపేట్, ; జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపిన మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి స్వాతంత్ర్య సంగ్రామంలో 1905 నాటి స్వదేశీ ఉద్యమంలో చేనేత మూలాలను కలిగి ఉందిని భారతీయ నిర్మిత ఉత్పత్తులకు అనుకూలంగా బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం అప్పట్లో ఉద్యమం యొక్క లక్ష్యమని ఆ సమయంలో విస్తృతంగా ప్రచారం చేయబడిన ముఖ్యమైన ఉత్పత్తులలో చేనేత వస్త్రాలు ఒకటన్నారు.
ఒక సాధనమైన చేనేత నేటి తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రధానంగా నిలిచిందని పేర్కొన్నారు. చేనేతకు పునరుజ్జీవనం కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్నారు. మహిళా శక్తి గ్రూప్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
నిండైన భారతీయతకు నిజమైన అందాన్ని ఇచ్చే చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు ప్రోత్సాహాన్ని అందిద్దాం అని ఆయన కోరారు

Post a Comment