-->

దక్షిణమద్య రైల్వే జి.ఎం.తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులిటీ శ్రీనివాస్ రెడ్డి బేటీ

 

దక్షిణమద్య రైల్వే జి.ఎం.తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులిటీ శ్రీనివాస్ రెడ్డి బేటీ

దక్షిణమద్య రైల్వే జి.ఎం.తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులిటీ శ్రీనివాస్ రెడ్డి బేటీ

హైదరాబాద్: ఖమ్మం జిల్లా మరియు వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మద్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు బుదవారం నాడు రైల్ నిలయం లో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో మంత్రి సమావేశం అయ్యారు. 

 డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్ గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుండి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం పాలేరు లోని నాలుగు మండల మీదుగా ఈ రైల్వే మార్గం వెళ్తుందని దీనివల్ల సాగు భూమలను రైతులు కోల్పోవలసి వస్తుందని, దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పుచేసి  మరో మార్గములో రైల్వేలైన్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 అదేవిదంగా, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (కుడా) మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకొని వరంగల్ నగర బైపాస్ రైల్వే లైన్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.  

వరంగల్ నగర అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2050 కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తున్నదని, ఈ నేపద్యంలో రైల్వే శాఖ నష్కల్ నుండి హసన్ పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్ మాస్టర్ ప్లాన్ కు అనుసందానం చేయాలని కోరారు. 

 ప్రస్తుతం సిద్దం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అలైన్ మెంట్ మార్చాలని జి.ఎం. గారికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో ఆర్.&బి. శాఖ, ప్రత్యేక కార్యదర్శి, హరి చందన తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793