-->

ఇద్దరు నకిలీ వైద్యుల పై కేసు నమోదు!

ఇద్దరు నకిలీ వైద్యుల పై కేసు నమోదు!

 ఇద్దరు నకిలీ వైద్యుల పై కేసు నమోదు!

వైద్యులుగా చలామణి అవుతున్న ఇద్దరిపై కేసు నమోదైనట్లు సమాచారం. తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట ఉన్నత వైద్య అధికారులు నర్సంపేటలో తనిఖీలు చేపట్టారు. చికిత్స చేయడానికి అర్హత లేకుండా డాక్టర్ అని బోర్డుపై పెట్టుకుంటూ, ఎలాంటీ అనుమతి లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనపై నర్సంపేట పట్టణ సీఐ వివరణ కోరగా... నర్సంపేట పట్టణానికి చెందిన కే. జయేందర్ రెడ్డి, ఎన్. శ్యామ్ రాజు అనే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ సభ్యుడు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ ఎలాంటి అర్హత లేకుండా డాక్టర్ అని బోర్డులపై పెట్టుకుంటూ వైద్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించడం గమనార్హం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793