బీఆర్ఎస్ పూర్వ వైభవం రావాలంటే వనమా రాఘవకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి
బీఆర్ఎస్ పూర్వ వైభవం రావాలంటే వనమా రాఘవకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి
newsupta9.com: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం రావాలంటే వనమా రాఘవకు జిల్లా అధ్యక్షుడు చేస్తే గతంలో లాగా పూర్వ వైభవంలాగా పార్టీని బలోపేతం చేసే సత్తా ఉన్న నాయకుడు వనమా రాఘవ.
నేడు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది. పేరుకే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్న పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో సరియైన నాయకుడు లేక కొన్సిలర్లు చేజారి పోతున్నారు. నాయకులు, కార్యకర్తలు సైతం తల ఒక దారి చూసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది.
కేసీఆర్ కూడా యువ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి చురుకైన యువ నాయకుడు వనమా రాఘవ. పార్టీ కార్యక్రమాలైన, మంత్రుల ప్రారంభోత్సవాల కార్యక్రమాలైన, శాసనసభ ఎన్నికలైన, పార్లమెంటు ఎన్నికలైన, స్థానిక ఎన్నికలైన, చురుకుగా పనిచేస్తూ కార్యకర్తలను, నాయకులను పనులను పురమాయిస్తూ అట్టి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసే యువ నాయకుడు వనమా రాఘవ. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి కొత్తగూడెం నియోజక వర్గం అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ క్రమంలో స్థానిక గ్రామపంచాయితి ఎన్నికలు ముంచుకొచ్చాయి, చుంచుపల్లి 18 సర్పంచులకు గాను బీఆర్ఎస్ పార్టీ 15 సర్పంచులు విజయం సాధించారు, లక్ష్మీదేవిల్లి 31 సర్పంచులకు గాను బీఆర్ఎస్ 25 సర్పంచులు విజయం సాధించారు, సుజాతనగర్ 21 సర్పంచులకు గాను బీఆర్ఎస్ 17 సర్పంచులు విజయం సాధించారు.
కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికలలో 36 కౌన్సిలర్లు స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ 25 కౌన్సిలర్లు విజయం సాధించారు. ఎంపిపి, జెడ్పిటిసీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రాజకీయ చతురుడు ఒకే ఒక్కడు వనమా రాఘవ. కోపం, కసురుకోవడం, దురుసుతనం, అతని నైజం, అంతలోనే మరల మచ్చిక చేసుకోవడం స్వభావం అతనిది. జిల్లాలో
బీఆర్ఎస్ నాయకత్వ లోపం వలన కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తలా ఒక్క దారిని చూసుకుంటూ జారిపోతున్నారు. పార్టీలో ఉన్న కొంత మందినైన కాపాడుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం. పార్టీని బ్రతికించుకోవాలంటే నాయకులకు, కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడు అవసరం.
పార్టీ లో ఉన్న క్యాడర్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సరియైన నాయకుడుని జిల్లా అధ్యక్ష పదవిలో నియమించాలి. ఇందుకు పూర్తిగా సమర్ధవంతుడు వనమా రాఘవ అని నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

Post a Comment