-->

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలి జిల్లా కలెక్టర్

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలి జిల్లా కలెక్టర్

 ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలి జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించాలని తద్వారా ప్రతి భవనం పై పడినటువంటి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూగర్భ జలాల అభివృద్ధికి తోడ్పడాలని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

ప్రభుత్వం బిల్డింగ్ లకు గాని ప్రైవేట్ బిల్డింగ్లకు గాని ప్రతి ఒక్కరు వీటిని నిర్మించి భావి తరాల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. గురువారం విద్యానగర్ గ్రామపంచాయతీలో నిర్మించిన టువంటి రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ తో పాటుగా కొత్త వరవడి తోటి ఏర్పాటు చేసినటువంటి పిచ్చి గడ్డిని తొలగించు యంత్రాన్ని పరిశీలించారు. 

ఈ విధానం చాలా బాగుందని, ఈ యంత్రాన్ని అందరూ ఉపయోగించే విధంగా అవగాహన కల్పించాలని తెలియజేసి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనస మొక్కలు నాటి, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అందరూ మొక్కలు నాటే విధంగా అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యా చందన, చుంచుపల్లి తాసీల్దార్ విద్యానగర్ ప్రత్యేక అధికారి పానెం కృష్ణ, ఎంపీడీవో వీడివి అశోక్ కుమార్, ఎంపీఓ సత్యనారాయణ ఈజీఎస్ ఈసీ పి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సంజీవరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793