పోరాట ఫలితమే ఎస్.ఆర్.టి కాలని నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఎమ్మెల్యే కూనంనేని
పోరాట ఫలితమే ఎస్.ఆర్.టి కాలని నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఎమ్మెల్యే కూనంనేని
పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం: పోరాటాలు, సింగరేణి యాజమాన్యంపై వత్తిడి చేసిన ఫలితంగానే రుద్రంపూర్ ఎస్ ఆర్ టి కాలని నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు మంజూరయ్యాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
రుద్రంపూర్ ఎస్ ఆర్ టి కాలని నిర్వాసితులకు గంగాహుస్సేన్ బస్తి సమీపంలో కేటాయించిన స్థలాల్లో భూమిపూజ నిర్వహించిన అనంతరం కూనంనేని లబ్ధిదారులకు హక్కులు కల్పించారు.
ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ ఎస్సార్టీ కాలనీలో నివసించే మాజీ కార్మికులు, మాజీ కార్మికుల కుటుంబాలు, పేదలను సింగరేణి యాజమాన్యం ఖాళీ చేయించి ఇండ్లను కూల్చివేయడంతో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలని పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.
అధికారులకు వినతులు అందించడంతో గంగాహుస్సేన్ బస్తీలో ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. వీరికి పక్కా గృహాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో సింగరేణి యాజమాన్యం, మున్సిపల్ శాఖ మౌళికవసతులు కల్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ సల్మాన్ రాజు, చైపర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్లు అనిల్, బోయిన విజయ్, ప్రసాద్, మాజీ కౌన్సిలర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment